Sunday, February 3, 2013

కిరణజన్య సంయోగ క్రియ

కిరణజన్య సంయోగ క్రియ

కిరణజన్య సంయోగ క్రియ మొక్కలు సూర్యకాంతి సమక్షం లో వాతావరణం లోని కార్బన్ డై ఆక్సైడ్ ని వినియొగించుకొని పిండిపధార్దాలను తయారుచేసే జీవరసాయనచర్య ను కిరణజన్యసంయోగక్రియ అంటారు. మొక్కలు ఈ జీవరసాయనప్రక్రియ లో కాంతిశక్తి ని వినియొగించుకొని కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీరు ని ఆక్సిజన్ మరియు పిండి పదార్ధాలుగా మార్చును. మొక్కల పత్రముల కణములలో గల కణాంగము హరితరేణువు (క్లోరోప్లాస్టు) నందు జరుగును. హరితరేణువులో ఉండే పత్రహరితం అనే వర్ణద్రవ్యం కాంతిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా చర్యావిధానము క్రింది విధంగా ఉండును.
CO2 + 2 H2O + photons → (CH2O)n + H2O + O2
కార్బన్ డై ఆక్సైడ్ + నీరు + కాంతిశక్తి పిండిపధార్దాలు + నీరు + ఆక్సిజన్
ఈ ప్రక్రియ భూమిమీద జరిగే జీవరసాయనచర్యలలో అతిముఖ్యమైనది. మొక్కల మీద ఆధారపడి జీవించే పరపోషకాలు అయిన జంతుజాతికి చెందిన జీవులన్నింటికీ ఈ ప్రక్రియ జీవనాధారం. అంతే కాకుండా వాతావరణం లో కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్ ల సమతాస్థితిని కాపాడే కీలక ప్రాధాన్యత గల చర్య. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారుచేసుకోవడం వలన మొక్కలను స్వయంపోషకాలు [ఫోటోఆటోట్రోప్స్] అని అంటారు. మొక్కలు, శైవలాలు (ఆల్గీ) మరియు సయనో బాక్టీరియా లు కాంతిశక్తి ని వినియోగించుకొని కార్బన్ డై ఆక్సైడ్ ని పిండిపధార్దం గా మార్చును. కొన్ని బాక్టీరియాలు కార్బన్ డై ఆక్సైడ్ కు బదులుగా పిండిపధార్దాలు, ఫాటీఎసిడ్స్. ఆల్కాహాల్ ను వినియొగించుకొని కాంతి సమక్షంలో కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేసుకొటాయి. కనుక వీటిని ఫోటో హెటిరోట్రోప్స్ అంటారు. కిరణజన్యసంయోగక్రియ వాతావరణం లో కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్ ల సమతాస్థితిని కాపాడి అన్ని జీవరాశుల మనుగడకు సహాయపడే కీలక ప్రాధాన్యత గల చర్య. అన్ని జీవరాశులు ప్రత్యక్షంగానో,పరోక్షంగానో కిరణజన్యసంయోగక్రియ పై ఆధారపడతాయి. కిరణజన్యసంయోగక్రియ ద్వారా సంవత్సరానికి సుమారు 100టెరావాట్స్ కాంతిశక్తి వినియోగించబడును. ఇది మానవాళి వినియోగించె విధ్యుత్ కన్నా ఎడు రెట్లు అధికము. కిరణజన్యసంయోగక్రియ జరిపె జీవులన్నీ సంవత్సరానికి 10,000,000,000 టన్నుల కార్బన్ ను వినియోగించుకొటాయి.
కిరణజన్యసంయోగక్రియలో కాంతి చర్య, నిష్కాంతి చర్య అను రెండు దశలు ఉంటాయి. మొధటిదశలో కాంతిశక్తి గ్రహించబడి రసాయనశక్తి ఎ.టి.పి., ఎన్.ఎ.డీ.పి.హెచ్. గా మార్చబడును. వీటిని ఉపయోగించుకొని రెండోదశలో కార్బన్ డై ఆక్సైడ్ ను పిండిపధార్ధాలు గా మార్చును. కిరణజన్యసంయోగక్రియ అన్ని జీవజాతులలో పూర్తిగా ఒకే విధంగా ఉండదు.

No comments:

Post a Comment